వైరల్ వీడియో: మాజీ సీఎం కోడలు అదిరేటి స్టెప్పులు..

29 Nov, 2017 17:42 IST|Sakshi

సాక్షి, లక్నో: దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చారిత్రాత్మక చిత్రం పద్మావతిపై పలు రాష్ట్రాల్లో వివాదం కొనసాగుతుంటే యూపీ మాజీ సీఎం కోడలు మూవీలోని ఓ పాటకు ఓ ఫంక్షన్‌ల్ డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మూవీ పాటకు ఆమె ఎందుకు డ్యాన్స్ చేసిందంటూ కర్ణిసేన ప్రశ్నించింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ అపర్ణా యాదవ్ సోదరుడి నిశ్చితార్థం లక్నోలో జరిగింది.

ఆ వేడుకలో అపర్ణా యాదవ్ మస్త్ మస్త్ స్టెప్పులేసి అదర గొట్టేశారు. వివాదాస్పద పద్మావతి మూవీలోని ఘుమర్ పాటకు ఆమె చక్కటి డ్యాన్స్ చేశారు. తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో అక్కడున్న వారిని ఆకట్టుకున్నారు. అపర్ణ స్టెప్పులకు ఫంక్షన్‌కు హాజరైనవారంతా ఫిదా ఐపోయారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ తరఫున లక్నో కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి అపర్ణా యాదవ్ ఓటమి పాలయ్యారు.

రాణి పద్మావతికి సంబంధించిన కొన్ని సీన్లు తొలగించాలన్న రాజ్‌పుత్ వర్గానికి చెందిన కర్ణిసేన.. దర్శకుడు భన్సాలీ చరిత్రను వక్రీకరించాడంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా కొన్ని రాష్ట్రాల్లో పద్మావతి మూవీపై ఆంక్షలు విధించారు. ఇదివరకే పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాలు పద్మావతి మూవీపై నిషేధం విధించగా.. ఈ చిత్రాన్ని బిహార్‌లోనూ ప్రదర్శించొద్దని సీఎం నితీశ్‌ కుమార్‌ నిన్న (మంగళవారం) అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు