‘నిందితులను చంపాలనే ఆలోచన రాలేదు’

7 Dec, 2019 03:33 IST|Sakshi
ఢిల్లీ మాజీ పోలీస్‌ కమిషనర్‌ నీరజ్‌ కుమార్‌

న్యూఢిల్లీ: యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన నిర్భయ కేసును పర్యవేక్షించిన ఢిల్లీ మాజీ పోలీస్‌ కమిషనర్‌ నీరజ్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిందితులను చంపేయాలన్న ఆలోచన తమకు ఎప్పుడూ రాలేదని చెప్పారు. దిశపై గ్యాంగ్‌రేప్‌ చేసిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. నిర్భయ ఘటన జరిగినప్పటి పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉండేవని గుర్తు చేసుకున్నారు.

డిసెంబర్‌ 16, 2012న నిర్భయపై గ్యాంగ్‌రేప్‌ జరిపి తీవ్రంగా గాయపరచడంతో ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో పెద్దఎత్తున నిరసన వ్యక్తమైంది. ‘నిందితులను బాగా ఆకలిగా ఉన్న సింహాలకు వదిలేయండి. ప్రజలకు అప్పగించండి. అంటూ మాకు చాలా మెసేజ్‌లు వచ్చాయి. కానీ మేం చట్టాన్ని అనుసరించాం’ అని అన్నారు. ప్రతి ఎన్‌కౌంటర్‌ తర్వాత ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయని, ఇది ఒక ఉగ్రవాదిపైనో లేదా గ్యాంగ్‌స్టర్‌పైనో జరిగింది కాదని చెప్పారు. ఈ కేసుపై ప్రజల దృష్టి ఎక్కువగా ఉందన్నారు.

మరిన్ని వార్తలు