ఆర్థిక బిల్లుకు ఆమోదం: లోక్‌సభ రేపటికి వాయిదా

14 Mar, 2018 13:22 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: 2018 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆర్థికబిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. సభలో విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే 21 సవరణలు, 3 కొత్త క్లాజులతో  2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను సప్లిమెంటరీ డిమాండ్లను  సభ ఆమోదించింది. అనంతరం లోక్‌ సభ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డాయి.

కాగా ఇవాళ పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది.  విభజన హామీలు, ప్రత్యేక హోదాపై, వివిధ సమస్యలపై పలు పార్టీలు ఆందోళన చేయడంతో లోక్‌సభ ఎనిమిదో రోజు కూడా అట్టుడికింది.  ప్రత్యేక హోదా విషయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు. కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్లుకోవాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. దీంతో సభను స్పీకర్‌  సుమిత్రామహాజన్‌ కొంతసేపు వాయిదా వేశారు.  తిరిగి ప్రారంభమైన అనంతరం ఫైనాన్షియల్ బిల్లు ఆమోదం పొందిన వెంటనే ప్రతిపక్ష పార్టీల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో లోక్‌సభ స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు