గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ పరిశీలకులు వీరే..

29 Dec, 2017 16:30 IST|Sakshi

న్యూఢిల్లీ : రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండేలను గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల పరిశీలకులకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శుక్రవారం నియమించారు. వీరిద్దరికీ ఆయా రాష్ట్రాల్లో సీఎల్‌పీ నాయకులను ఎన్నుకునే బాధ్యతను అప్పగించారు. నాయకులను ఎన్నుకోవడంతో అశోక్‌ గెహ్లాట్‌కు గుజరాత్‌లో కేంద్ర మాజీ మంత్రి జితేంద్ర సింగ్‌, సుశీల్‌ కుమార్‌ షిండేకు హిమాచల్‌ ప్రదేశ్‌లో మహారాష్ట్ర మాజీ మంత్రి బాలా సాహెబ్‌ తోరాట్‌ తోడ్పాటునందిస్తారు.

ఇటీవల ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన సంగతి తెలిసిందే. మేఘాలయాలో త్వరలో ఎన్నికలు జరుగనుండటంతో ఆ రాష్ట్ర బాధ్యతలను మహారాష్ట్ర ఎమ్మెల్యే యాషోమతి ఠాకూర్‌కు అప్పగించారు. అనిల్‌ థామస్‌, నెట్టా డిసౌజా, సుసాంతో బోర్గోయిన్‌అను డివిజనల్‌ కో-ఆర్డినేటర్లుగా నియమించారు. వీరు ఎన్నికలకు సంబంధించిన అంశాలలో ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ సీపీ జోషి, సెక్రటరీ విజయ లక్ష్మీ సాదోలకు సహకరిస్తారు.

మరిన్ని వార్తలు