భారత పర్యటనలో జర్మనీ ఛాన్సలర్‌

1 Nov, 2019 11:11 IST|Sakshi
ప్రధాని నరేంద్ర మోదీతో జర్మనీ ఛాన్సలర్‌ డాక్టర్‌ ఏంజెలా మెర్కెల్‌

న్యూఢిల్లీ : జర్మనీ ఛాన్సలర్‌ డాక్టర్‌ ఏంజెలా మెర్కెల్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు విచ్చేశారు. గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆమెకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీలు ఘన స్వాగతం పలికారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్‌కు విచ్చేసిన ఆమె భారత్‌, జర్మనీ సత్సంబంధాలపై మాట్లాడారు. అనంతరం రాజ్‌ఘట్‌లో జాతిపిత మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. నేటి పర్యటనలో భాగంగా మెర్కెల్‌ ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరగనుంది. దాదాపు 20 ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది. రేపటి (శనివారం) పర్యటనలో భాగంగా మెర్కెల్‌ పలువురు వ్యాపారవేత్తలతో చర్చలు జరపనున్నారు. చివరగా ద్వారకా సెక్టార్‌ 21 మెట్రో స్టేషన్‌ను ఆమె సందర్శించనున్నారు.

మరిన్ని వార్తలు