మూడుసార్లు తలాక్‌ అంటే ఇక కటకటాల్లోకే... 

15 Dec, 2017 21:30 IST|Sakshi

ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం  

సాక్షి, న్యూఢిల్లీ/కోల్‌కతా: ఎప్పటినుంచో కొనసాగుతున్న ట్రిపుల్‌ తలాక్‌ విధానానికి త్వరలో తెరపడనుంది. ఇకమీదట ఎవరైనా మూడు పర్యాయాలు తలాక్‌ చెప్పి విడాకులు తీసుకోవడం అక్రమం. ఇలా చేసినవారికి మూడేళ్ల వరకూ కారాగారశిక్ష పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ముస్లిం ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌ ఆన్‌ మేరేజ్‌ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని అంతర్గత మంత్రుల బృందం ఈ ముసాయిదాని రూపొందించింది.

ఈ బృందంలో విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్, ఆయన జూనియర్‌ మంత్రి చౌదరి ఉన్నారు. ఎవరి భర్త అయినా మూడు పర్యాయాలు తలాక్‌ చెప్పిన సందర్భంలో ఈ చట్టం వర్తిస్తుంది. ఈ ముసాయిదాకు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ప్రసాద్‌ మద్దతు పలికారు. కోల్‌కతలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పురుషులు, మహిళలు సమానంగా హక్కులను అనుభవించాలని, లింగసమానత్వం ఉండాలని, 21వ శతాబ్దంలో అందరూ గౌరవించాల్సిందేనన్నారు.

మరిన్ని వార్తలు