29న జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–08 ప్రయోగం

21 Mar, 2018 03:23 IST|Sakshi

శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరా ములు నెల్లూరు జిల్లా సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 29న సాయంత్రం 4.29 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–08 ప్రయోగా న్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నా రు. దీనికి సంబంధించి మంగళవారం 2,140 కిలోలు బరువు ఉన్న జీశాట్‌–6ఏ ఉపగ్రహాన్ని రాకెట్‌ శిఖరభాగాన అమర్చే పనులను పూర్తి చేశారు. 21, 22 తేదీల్లో రాకెట్‌కు గ్లోబల్‌ చెకింగ్‌ చేయనున్నారు.

అనంతరం ఈ నెల 23 తేదీన ఉదయాన్నే జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–08 రాకెట్‌ను అనుసందాన భవనం నుంచి ప్రయోగవేదిక వద్దకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నా రు. వారం రోజులపాటు అన్ని తనిఖీలు నిర్వహించి 29న ప్రయోగించడమే లక్ష్యం గా శాస్త్రవేత్తలు పనులు పూర్తి చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు