ఎలిఫెంట్‌ టూత్‌పేస్ట్‌ ప్రయోగం గురించి విన్నారా! పాపం ఓ యూట్యూబర్‌

5 Oct, 2023 11:54 IST|Sakshi

ఇటీవల యూట్యూబ్‌లో రకరకాల వైరైటీ వీడియోలు చేస్తూ మంచి క్రేజ్‌ తోపాటు పేరు తెచ్చుకుంటున్న యూట్యూబర్లకు కొదువే లేదు. కాకపోతే కొందరూ ఈ పిచ్చిలో కాస్త తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి లైవ్‌ వీడియోలు చేస్తున్నారు. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఆన్‌లైన్‌ క్రేజీ ఆరాటం ఎంత ఉన్నా కాస్త వ్యక్తిగతం ఏది ఎంత వరకు బెటర్‌ అన్నది బేరీజు చూసుకుని చేస్తేనే మంచిది. ఇక్కడొక యూట్యూబర్‌ కూడా అలానే ఎలిఫెంట్‌ టూత్‌పేస్ట్‌ ప్రయోగం అంటూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోయి అతడే మతితప్పి పడిపోయే సంకట పరిస్థితి ఎదురైంది.

కొన్ని లైవ్‌ వీడియోలు సీరియస్‌గా మారి వారి ప్రాణాలనే ఉక్కిబిక్కరి చేసేంత భయానకంగా ఉన్నాయి. దయచేసి ఇలాంటివి చేయాలనుకునే ఔత్సాహిక యూట్యూబర్‌లు ముందుగా ట్రయల్స్‌ వేసిగానీ రిస్క్‌ వీడియోలు చేసే సాహసం చెయొద్దు. ఇంతకీ ఆ యూట్యూబర్‌ చేసిన ‍ప్రయోగం ఏంటంటే ఎలిఫెంట్‌ టూత్‌పేస్ట్‌ ప్రయోగం. జంబో రేంజ్‌లో టూత్‌ పేస్ట్‌లాంటి నురుగు పదార్థాన్ని తయారు చేయడం. ఇది నిపుణుల పర్యవేక్షణలో చేయకపోతే ఆ రసాయనాలు రియాక్షన్‌ ఇచ్చి వికటిస్తే మొదటికే మోసం వస్తుంది.

ఈ యూట్యూబర్‌ కూడా అలాంటి చేదు అనుభవాన్నే ఎదుర్కొన్నాడు. లైవ్‌లో ఆ వింత ప్రయోగాన్ని చేస్తుండగా నురగలు కక్కుతూ పేస్ట్‌ వస్తూ ఓ విధమైన పొగ ఆ ప్రదేశం అంతా క్షణాల్లో ఆవిరించింది. సరిగ్గా సమయానికి అగ్నిమాక సిబ్బంది రంగంలోకి దిగి ఆ యూట్యూబర్‌ని కెమరామెన్‌ని వెంటనే ఆ గది నుంచి బయటకు తీసుకొచ్చి రక్షించే యత్నం చేశారు కాబట్టి సరిపోయింది. ప్రస్తుతం ఇద్దరికి కుత్రిమంగా ఆక్సిజన్‌ని అందిస్తున్నారు వైద్యులు.

ఇంతకీ ఆ ఎలిఫెంట్‌ టూత్‌పేస్ట్‌ ప్రయోగం ఏంటంటే..
ఇదొక శాస్త్రీయమైన ప్రక్రియ. ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్, డ్రై ఈస్ట్, డిష్ సోప్ కలవగానే ఒక విధమైన నురుగు పదార్థాన్ని సృష్టిస్తారు. చూస్తే ఎక్కువ మొత్తంలో ఊహించని రేంజ్‌లో ఆ నురుగు వస్తుంది కాబట్టి దీన్ని ఎలిఫెంట్‌ టూత్‌పేస్ట్‌ ప్రయోగం అని పిలుస్తున్నారు. ఈ మూడు పదార్థాలు కలిసినపుడు రసాయనాలు ప్రతిస్పందించి ఆక్సిజన్‌ వాయువును విడుదల చేస్తాయి.

అది మనం తట్టుకోలేనంతగా ఒక్కొసారి రావచ్చు దీంతో మన ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితికి దారితీస్తుంది. అంతేగాదు రాత్రి టైంలో మొక్కలు అధిక ఆక్సిజన్‌ విడుదల చేస్తాయనే కదా మన పెద్దవాళ్లు చెట్ల కింద పడుకోవద్దనేది. మోతాదుకి మించిన ఆక్సిజన్‌ని మనిషిని ఉక్కిరిబిక్కిరిచేసి ప్రాణాలను హరించేస్తుంది. ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడూ తస్మాత్‌ జాగ్రత్త..!

(చదవండి: అపార్ట్‌మెంట్‌ విండోలో భారీ కొండచిలువ..చూస్తే హడలిపోతారు!)

మరిన్ని వార్తలు