మాక్ డ్రిల్‌లో ‘ఉగ్రవాదులకు’ ముస్లిం టోపీలు!

1 Jan, 2015 02:56 IST|Sakshi
  • గుజరాత్ పోలీసుల నిర్వాకం
  • సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లో పోలీసులు బుధవారం నిర్వహించిన ఉగ్రవాద నిరోధక మాక్ డ్రిల్ వివాదాస్పదమైంది. డ్రిల్‌లో భాగంగా ముగ్గురు యువకులను ఉగ్రవాదులుగా నటించమని కోరిన పోలీసులు ఇందుకోసం వారికి ముస్లిం టోపీలు ఇవ్వడంపై రాజకీయ దుమారం రేగింది. దీనిపై తీవ్రంగా మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ...ప్రజలను మత ప్రాతిపదికన విభజించేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టింది. పోలీసుల చర్యను గుజరాత్ బీజేపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మెహబూబ్ అలీ సూఫీ బాబా కూడా తప్పుబట్టారు. అయితే పోలీసులు మాత్రం తమ చర్యను సమర్థించుకున్నారు. మాక్ డ్రిల్స్‌ను రకరకాల వేషధారణల్లో నిర్వహిస్తుంటామని...ఇందులో తప్పేమీ లేదన్నారు.
     

మరిన్ని వార్తలు