60 వస్తాయనుకుంటే.. 99 వచ్చాయి

24 Dec, 2017 02:37 IST|Sakshi

గుజరాత్‌ ఎన్నికల ఫలితాలపై బీజేపీ వర్గాలు

సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్‌ ఎన్నికలపై తొలుత జరిపిన అంతర్గత సర్వేలో కేవలం 60 సీట్లే గెలుస్తామని తేలినట్లు బీజేపీ పార్టీ వర్గాలు చెప్పాయి.   ఈ ఫలితాలతో ఆందోళన చెందకుండా అప్పటికప్పుడు తీసుకున్న నష్ట నివారణ చర్యలతో విజయం సాధించగలిగామని బీజేపీ సీనియర్‌ నాయకుడు ఒకరు శనివారం తెలిపారు. 22 ఏళ్లుగా పార్టీ అధికారంలో ఉండడం, ప్రధాని మోదీ గుజరాత్‌లో లేకపోవడం, రాష్ట్రంలో కులసమీకరణాలు బీజేపీకి ప్రతికూలంకావచ్చొని అంచనా వేశామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం లేకపోవడం తమకు కలిసొచ్చిందని పేర్కొన్నారు. ఏపీలో టీడీపీతో పొత్తుపై స్పందిస్తూ...ఆ పార్టీతో బీజేపీకి పొసగని సంగతిని అంగీకరించారు. ఇక తెలంగాణలో ఒంటరిగానే పోటీచేయాలని భావిస్తున్నట్ల చెప్పారు.

మరిన్ని వార్తలు