నీలగిరిలో భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌

10 Aug, 2019 10:02 IST|Sakshi

సాక్షి, చెన్నై: మొన్నటి వరకు తీవ్ర నీటి ఎద్దడితో తల్లడిల్లిన తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పర్యటక ప్రాంతమైన నీలగిరి కొండల్లో భారీ వర్షాలతో.. వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. పిల్లూరు ఆనకట్టకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఉండడంతో.. ఆనకట్ట ప్రమాదకరంగా మారింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా నీలగిరి జిల్లాల్లో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. పిల్లూరు ఆనకట్ట దిగవ ప్రాంతంలో పలు గ్రామాలు నీట మునిగాయి. దీంతో ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌ పోర్స్‌ సాయంను కోరింది. దానికితోడు ప్రభుత్వ యంత్రాంగమంతా ఎప్పటికప్పడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. సహాయ చర్యలను ముమ్మరం చేస్తోంది.

మరోవైపు కావేరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో నదీ పరివాహాక ప్రాంతాల్లో దండోరా వేసి ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తున్నారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు పడుతుండటంతో హోగెనేకల్‌లో వాగులు, జలపాతాలు ఉప్పొంగుతున్నాయి. మరోవారం పాటు ఇదే స్థాయిలో వరద కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు