కేరళ ప్రభుత్వ ని‍ర్ణయంపై అభ్యంతరం

25 Jul, 2018 20:22 IST|Sakshi

తిరువనంతపురం : కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరోదించడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. న్యాయస్థానం తీర్పును ఏకీభవించిన కేరళ ప్రభుత్వం మహిళల ఆలయంలోకి రావచ్చునని పేర్కింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పలు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని శ్రీ రామ సేన, హనుమాన్‌ సేన, శ్రీ అయ్యప్ప ధర్మసేన వంటి హిందూ సంఘాలు ప్రకటించాయి. శబరిమల ఆలయంలోకి మహిళ ప్రవేశంపై దాఖలపై పిటిషన్‌ను జస్టిస్‌ దీపక్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారిస్తూ.. ఆలయాలు ప్రవేటు ఆస్తులు కావని, మహిళలను ఆలయంలోని రాకుండా ఆడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు