ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆధార్!

26 Oct, 2014 12:44 IST|Sakshi
ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆధార్!

న్యూఢిల్లీ: దేశంలో ఆధార్ కార్డుకు ప్రాధాన్యత పెరిగిపోతోంది. ప్రతి పౌరుడుకి ఇది తప్పనిసరిగా మారింది. భవిష్యత్లో ఎన్నో అవసరాలకు ఇది ఉపయోగపడనుంది. ఒకప్పుడు  పూర్తిగా వ్యతిరేకించినవారు కూడా ఇప్పుడు దీని ప్రాధాన్యతను గుర్తించారు. ఒక వ్యక్తికి ఒక ఆధార్ నెంబర్ మాత్రమే ఇస్తారు.  ఆ వ్యక్తి ఫొటో గుర్తింపుకు, చిరునామా గుర్తింపుకు ఇది ఉపయోగపడుతుంది. దీనిని దేశవ్యాప్తంగా పరిగణలోకి తీసుకుంటారు. ప్రతి సందర్భంలోనూ పౌరులకు ఇది ఉపయోగపడుతుంది.

ఆధార్ కార్డు  ఉపయోగాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం  ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆధార్ కార్డు ఇస్తామని కేంద్ర హొం శాఖ ప్రకటించింది. ఈ మేరకు హొం శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది.

 దేశంలో ఆధార్ కార్డులు ఇవ్వడాన్ని 2009లో మొదలు పెట్టారు. పౌరులకు గుర్తింపుతోపాటు  దీని ఆధారంగా  సంక్షేమ పథకాలను  అమలు చేయాలని  అనుకున్నారు. అయితే అప్పట్లో దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. కాలక్రమంలో దీని ప్రాధాన్యతను గుర్తించడం మొదలుపెట్టారు. వినియోగాన్ని2010 ఆగస్టు నాటికి 67 కోట్ల 38 లక్షల మందికి ఈ కార్డులు ఇచ్చారు.  ఈ ప్రాజెక్టుకు 2014 ఆగస్టు వరకు 4,906 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
**

మరిన్ని వార్తలు