ఇకనుం‘చైనా’ మానుకో?!

10 Nov, 2017 09:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చైనాకు భారత్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటించడంపై చైనా వ్యక్తం చేసిన అభ్యంతరాలకు దిమ్మతిరిగే జవాబును భారత్‌ ఇచ్చింది. ’అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌లో పూర్తిగా అంతర్భాగం. భారతదేశ ప్రజలు, నాయకులు, అధికారులు ఇలా ఎవరైనా అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యటించే స్వేచ్ఛ ఉంది‘ అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మా దేశంలో భాగమైన ఒక రాష్ట్రాంలో పర్యటించే స్వేచ్ఛ, హక్కు కేంద్రమంత్రులకు ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్‌ కుమార్‌ చైనాకు ఘాటుగా సమాధానిచ్చారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలో చైనా భవిష్యత్తులో ఎటువంటి అభ్యంతరాలను లేవనెత్తినా.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రవీష్‌ హెచ్చరించారు. దక్షిణ టిబెట్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌ భాగమన్న చైనా వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. చైనా నిర్మిస్తున్న ఒన్‌ బెల్ట్‌ ఒన్‌ రోడ్‌ విషయంలో భారత్‌కు స్పష్టమైన, నిర్దుష్టమైన నిర్ణయాలు ఉన్నాయని రవీష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు