ఆయుష్షును హరిస్తున్న వాయు కాలుష్యం

20 Nov, 2018 17:02 IST|Sakshi
ఢిల్లీలో పొగలా అలుముకున్న కాలుష్యం

ఢిల్లీ: దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న వాయు కాలుష్యం పౌరుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోంది. వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సూచించిన జాగ్రత్తలు పాటించకపోతే పౌరుల ఆయుష్షు తగ్గిపోవడం ఖాయమంటున్నాయి అధ్యయనాలు. కాలుష్యం కారణంగా భారతీయులు తమ జీవిత కాలం కొద్ది సంవత్సరాలు కోల్పోవాల్సి వస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆరోగ్యంపై వాయు కాలుష్య ప్రభావం ధూమపానానికి సమానంగా, ఆల్కహాల్‌ ఉత్పత్తులకు రెండు రెట్లుగా, కలుషిత నీటికి మూడు రెట్లుగా, హెచ్‌ఐవీ కంటే అయిదు రెట్ల ప్రమాదకరమని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ ఎట్‌ యూనివర్శిటీ ఆఫ్‌ చికాగో (ఎపిక్‌) వెల్లడించింది.

ప్రపంచ దేశాలన్నిటిలో అత్యంత వాయు కాలుష్య దేశంగా నేపాల్‌ నిలవగా రెండో స్థానంలో ఇండియా ఉంది. ఢిల్లీ, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, హరియణా, పంజాబ్‌ రాష్ట్రాలలో కాలుష్యం ఎక్కువగా ఉందని ఎపిక్‌ తెలిపింది. ఇది కచ్చితంగా అక్కడ నివసిస్తున్న వారి ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుందని ఆ సంస్థ అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్గారమవుతోన్న కాలుష్య  ప్రభావం వల్ల ప్రతీ మనిషి తన జీవితంలో 1.8 సంవత్సరాలను కోల్పోనున్నాడని తెలిపింది. అయితే ఇండియాలో మాత్రం ప్రతీ వ్యక్తి నాలుగేళ్ల అయుష్షును కోల్పోనున్నారని ఆ సంస్థ స్పష్టం చేసింది. 

>
మరిన్ని వార్తలు