పాక్‌, కొరియా కుయుక్తులపై సుష్మా ఫైర్‌

19 Sep, 2017 11:21 IST|Sakshi
పాక్‌, కొరియా కుయుక్తులపై సుష్మా ఫైర్‌
న్యూయార్క్‌: ఉత్తర కొరియా చేపడుతున్న విధ్వంసకర అణుపరీక్షలకు పాకిస్తాన్‌ సహకరిస్తున్నదని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌ పరోక్షంగా వ్యాఖ్యానించారు. కొరియా అణ్వస్త్ర సంబంధాలను నిగ్గుతేల్చేందుకు విచారణ నిర్వహించాలని కోరారు. జపాన్‌ మీదుగా మరోసారి ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిన నేపథ్యంలో సుష్మా ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడిని బేఖాతరు చేస్తూ వరుస క్షిపణి పరీక్షలతో ఉత్తర కొరియా ముందుకెళుతోంది.
 
ఉత్తర కొరియా దూకుడును ఖండించిన సుష్మా స్వరాజ్‌ కొరియా అణు కార్యక్రమాలకు సహకరిస్తున్నవారిని విచారించి బాధ్యులపై చర్యలు చేపట్టాలని కోరారు.అయితే సుష్మా పాక్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారా అన్న ప్రశ్నకు నేరుగా బదులిచ్చేందుకు విదేశాంగ శాఖ ప్రతినిధి నిరాకరించారు. అయితే మంత్రి వ్యాఖ్యల సారాంశం దేశం పేరును గుర్తించేందుకు సరిపోతుందని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఐరాస భేటీ నేపథ్యంలో సుష్మా స్వరాజ్‌ జపాన్‌, అమెరికా మంత్రులతోనూ భేటీ అయ్యారని ఆ ప్రతనిధి తెలిపారు.
మరిన్ని వార్తలు