పాక్ రాయబారికి భారత్ సమన్లు

7 Sep, 2016 18:00 IST|Sakshi

న్యూఢిల్లీ/కరాచీ: భారత్ లోని పాకిస్థాన్ రాయబారి అబ్దుల్ బాసిత్కు భారత విదేశాంగ వ్వవహారాల శాఖ సమన్లు జారీ చేసింది. తమ దేశ అధికారిని కార్యక్రమానికి పిలిచి చిట్టచివరి నిమిషంలో ఆ కార్యక్రమం రద్దయిందని చెప్పి అవమానిస్తారా అని అందులో ప్రశ్నించింది. ఈ విషయంపై ఎలాంటి వివరణ ఇస్తారని, తమ ఆందోళన పాక్ ప్రభుత్వానికి చేరవేయాలని కోరింది. భారత్ తరుపున పాకిస్థాన్లో హైకమిషనర్ గా గౌతం బాంబ్వాలే పనిచేస్తున్న విషయం తెలిసిందే.

ఆయనను కరాచీలోని ఓ కార్యక్రమంలో మాట్లాడేందుకు పాక్ అధికారులు ఆహ్వానించారు. తీరా ఆయన బయలుదేరే సమయానికి రావొద్దంటూ చివరి నిమిషంలో సమాచారం ఇచ్చారు. ఇంతటి బాధ్యత రహితంగా వ్యవహరించిన పాక్ తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమన్లు పంపించింది. కాగా, దీనిపూ వివరణ కోరగా ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ ప్రతినిధులు వారి కార్యక్రమాలు పూర్తి చేయాలని భారత్ కోరుకుంటుందని అందులో భాగంగానే వివరణ కోరిందని చెప్పారు.

>
మరిన్ని వార్తలు