ఆ ఉద్యోగాలకు ఏకంగా 2కోట్ల దరఖాస్తులు!

27 Mar, 2018 21:04 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. చదివిన చదువులకు కొలువులు దొరకక, ప్రభుత్వాలు పట్టించుకోకపోవటంతో దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి వెళ్తోంది. ఏ చిన్న ఉద్యోగానికైనా లక్షల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. తాజాగా రైల్వేలో వెలువడిన 90,000 ఉద్యోగాలకు అభ్యర్థుల నుంచి వెల్లువెత్తిన దరఖాస్తులను చూసి రైల్వే అధికారులే ఆశ్చర్యపోయారు. 

రైల్వేశాఖలో గ్రూప్‌ సీ, డీ పోస్టులకుగాను రెండుకోట్లకుపైగా దరఖాస్తుల వచ్చినట్టు రైల్వే అధికారులు అధికారికంగా తెలిపారు. ఇంకా చివరి తేదికి గడువు ఉన్నందున్న దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇంతమందికి ఒకేసారి పరీక్షలు నిర్వహించడం, ఎంపిక చేయటం రైల్వే శాఖకి కష్టం కలిగించేదే..

మరిన్ని వార్తలు