'ఇన్స్పెక్టర్ రాజ్' పూర్తిగా అంతం కాలేదు

7 Nov, 2015 20:03 IST|Sakshi
'ఇన్స్పెక్టర్ రాజ్' పూర్తిగా అంతం కాలేదు

హైదరాబాద్: ఇందిరాగాంధి ప్రధానిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన 'ఇన్స్పెక్టర్ రాజ్' ఇప్పటికీ వ్యవస్థలో కొనసాగుతోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో 1990 లలో ప్రవేశపెట్టిన ఆర్థీక సంస్కరణలతో ఇన్స్పెక్టర్ రాజ్ విధానం క్షీణించినప్పటికీ పూర్తిగా అంతం కాలేదన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో ప్రధాని జవహార్లాల్ నెహ్రూ  తన వివేకంతో ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యతను కల్పించారనీ, అయితే ఇందిరాగాంధీ తన స్వంత ప్రయోజనాల కోసం చేసిన రాజ్యాంగ సవరణల ఫలితంగా ఇన్స్పెక్టర్ రాజ్ విధానం ఏర్పడిందన్నారు.


ఇన్స్పెక్టర్ రాజ్ అనేది ఫ్యాక్టరీలు, ఇండస్ట్రియల్ యూనిట్ల మీద ప్రభుత్వం యొక్క అతి జోక్యాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా 1970-80 మధ్య కాలంలో దేశంలో ఈ విధానం విపరీతమైన ప్రభావాన్ని చూపింది. ఈ మధ్య కాలంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు కూడా దానిని పూర్తిగా తొలగించలేకపోయిందనీ అయితే చాలా వరకు దాని ప్రభావం క్షీణించిందని వెంకయ్యనాయుడు తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు