నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ 45 

1 Apr, 2019 09:21 IST|Sakshi

శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ 45 వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. ఇస్రోలోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉదయం 9.27 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ45 (పీఎస్‌ఎల్‌వీ–క్యూఎల్‌) ఉపగ్రహ వాహక నౌకను శాస్త్రవేత్తలు రోదసీలోకి పంపారు. ఇందుకు సంబంధించి ఆదివారం ఉదయం 6:27 గంటలకు కౌంట్‌ డౌన్‌ను ప్రారంభమయ్యింది. 

మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ (ఎంఆర్‌ఆర్‌) కమిటీ ఆధ్వర్యంలో శనివారం సమావేశమై రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగపనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌) వారికి ఇస్రో శాస్త్రవేత్తలు అప్పగించారు. పీఎస్‌ఎల్వీ రాకెట్‌లలో సరికొత్త రాకెట్‌ ఇది. నాలుగు స్ట్రాపాన్‌ బూస్టర్లు సాయంతో చేస్తున్న ప్రయోగం కాబట్టి దీనికి పీఎస్‌ఎల్వీ –క్యూఎల్‌ అని నామకరణం చేశారు. ఈ తరహా రాకెట్‌ను మొట్టమొదటిసారిగా ఇస్రో ప్రయోగిస్తోంది. పీఎస్‌ఎల్వీ రాకెట్‌ సిరీస్‌లో ఇది 47వ ప్రయోగం కాగా, షార్‌ కేంద్రం నుంచి 71వ ప్రయోగం.   

మరిన్ని వార్తలు