‘ఆ రోజుల్లో తుక్డే-తుక్డే గ్యాంగ్‌ను చూడలేదు’

7 Jan, 2020 12:19 IST|Sakshi
కేంద్ర మంత్రి ఎస్‌ జైశంకర్‌

న్యూ ఢిల్లీ : తను జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో(జేఎన్‌యూ) చదువుకునే రోజుల్లో తుక్డే- తుక్డే గ్యాంగ్‌ను చూడలేదని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ సోమవారం వ్యాఖ్యానించారు. తుక్డే-తుక్డే అనే పదం సాధారణంగా ప్రతిపక్షాలపై దాడి చేయడానికి బీజేపీ, రైట్‌ వింగ్‌ సభ్యులు తరచూ ఉపయోగించే పదం. ముఖ్యంగా లెఫ్ట్‌ వింగ్‌ వారిని, వారికి మద్దతు ఇచ్చే వారిని ఈ పేరుతో విమర్శిస్తారు. ఆదివారం జేఎన్‌యూలో  చోటుచేసుకున్న హింసాత్మక దాడిని ఉద్ధేశించి కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా జై శంకర్‌ జేఎన్‌యూ పూర్వ విద్యార్ధి. (జేఎన్‌యూ హింస : వారి పాత్రే కీలకం..)

సోమవారం ఢిల్లీలో పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ఆర్టికల్‌ 370, పౌరసత్వ సవరణ చట్టం, వివాదాస్పద ఆయోద్య తీర్పు వంటి అనేక సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. అలాగే ప్రస్తుతం యూనివర్సిటీలో పరిస్థితిని గురించి అడిగినప్పుడు.. తాను జేఎన్‌యూలో చదువుకున్నప్పుడు తుక్డే తుక్డే గ్యాంగ్‌ను చూడలేదని సమాధానమిచ్చారు. అంటే లెఫ్ట్‌ వింగ్‌ వారిని ఉద్ధేశించి మంత్రి ఇలా బదులిచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీనే కుట్రపూరింతంగా జేఎన్‌యూలో దాడికి పాల్పడిందని వామపక్ష విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూండగా.. జేఎన్‌ఎస్‌యూ విద్యార్థి సభ్యులే తమపై దాడికి దిగారని ఏబీవీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా జేఎన్‌యూలో దాడికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించామని త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ఢిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు.
చదవండి: జేఎన్‌యూపై దాడి చేసింది వీరేనా!

>
మరిన్ని వార్తలు