-

ప్రమాదవశాత్తు నదిలో జారిపడ్డ జవాన్‌..

17 Apr, 2020 21:05 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రమాదవశాత్తూ సట్లెజ్ నదిలో ఓ జ‌వాన్ జారిప‌డ్డాడు. హిమాచల్‌ప్ర‌దేశ్‌లోని వాస్తవాధీన రేఖ ద‌గ్గ‌ర‌ పెట్రోలింగ్ పార్టీ ఓ వంతెన దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అత‌ని కోసం ఆర్మీ విస్తృతంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టింది. గల్లంతైన జవాన్‌ ట్రిపీక్ బ్రిగేడ్‌కు చెందిన లాన్స్ హవాల్దార్ ప్రకాశ్ రాళ్లగా గుర్తించారు. జవాను జారిపడిన విషయం తెలిసిన వెంట‌నే సైనికులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. తొలుత పెట్రోలింగ్ పార్టీ ఆపరేషన్ ప్రారంభించగా.. అనంతరం మరో 200 మంది గాలింపు చర్యల్లో దిగారు. నీటిమట్టం ఎక్కువగా ఉండడంతోపాటు ప్రవాహ ఉధృతి కూడా అధికంగా ఉన్నప్పటికీ ప్రకాశ్‌ కోసం గాలింపు కొనసాగిస్తున్నట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. డ్రోన్లు, నిఘా హెలికాప్టర్లతో పాటు ప్రత్యేక బలగాలు, ఇంజినీర్ టాస్క్‌ఫోర్స్‌ నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన ఈతగాళ్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు.

మరిన్ని వార్తలు