'పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించాలి'

31 Jan, 2016 20:33 IST|Sakshi
'పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించాలి'

చెన్నై: కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలనే ఎన్డీఏ సర్కారు అనుసరిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విమర్శించారు. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పెంచిన ఎక్సైజ్ డ్యూటీ వెంటనే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు ఎక్సైజ్ డ్యూటీ పెంచారని గుర్తు చేశారు.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోవడం దారుణమని పేర్కొన్నారు. చముర ధరల నియంత్రణను ఆయిల్ కంపెనీలకు అప్పగించడాన్ని తాము ముందు నుంచి వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పెంచిన  ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించాలని కేంద్రాన్ని జయలలిత కోరారు.

మరిన్ని వార్తలు