ఐఆర్‌సీటీసీ డౌన్‌: మండిపడుతున్న వినియోగదారులు 

23 Nov, 2023 13:29 IST|Sakshi

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) వెబ్‌సైట్‌ గురువారం మరోసారి డౌన్‌ అయింది. దీంతో సర్వీసులకు తాత్కాలికంగా  అంతరాయం ఏర్పడింది.  దీంతో  వినియోగదారులు ఇ‍బ్బందుల నెదుర్కొన్నారు.  దీంతో సోషల్‌మీడియాలో వినియోగదారులు   ఐఆర్‌సీటీసీపై  విమర్శలు గుప్పించారు.

దీంతో ఐఆర్‌సీటీసీ కూడా ట్విటర్‌ ద్వారా  స్పందించింది. సాంకేతిక సమస్య కారణంగా తమ వెబ్‌సైట్  (నవంబర్ 23, గురువారం )  సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలిగినట్టు వెల్లడించింది. త్వరలోనే  ఈ సమస్యను పరిష్కరిస్తామని ట్వీట్‌ చేసింది. (డీప్‌ఫేక్‌లపై కేంద్రం హెచ్చరిక : త్వరలో కఠిన నిబంధనలు)

గురువారం ఉదయం 10 గంటల నుంచే సాంకేతిక సమస్యను ఎదుర్కొంటోంది.. తత్కాల్ విండో ఓపెన్‌  కాగా యూజర్లు ఇబ్బందులు పడ్డారు.  అత్యవసరంగా కేన్సిల్‌ చేయాల్సిన టికెట్లు కేన్సిల్‌ కాగా, తత్కాల్‌ ద్వారా టికెట్లు బుక్‌ కాక యూజర్లు నానా అగచాట్లు పడ్డారు. దీంతో అధ్వాన్నమైన వెబ్‌ సైట్‌, దారుణమైన సేవలు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. IRCTC వెబ్‌సైట్  ద్వారా రేల్వే ప్రయాణికులు టిక్కెట్‌ల బుకింగ్‌ రైళ్ల స్థితిని తనిఖీ చేయడం, ఇతర సంబంధిత సమాచారాన్ని పొందుతారు. 

మరిన్ని వార్తలు