జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

6 Mar, 2017 03:08 IST|Sakshi
జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

ఇద్దరు ఉగ్రవాదుల హతం.. ఓ కానిస్టేబుల్‌ మృతి
శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని త్రాల్‌ ప్రాంతంలో భద్రతా బలగాలకూ.. ఉగ్రవాదులకూ మధ్య భారీ ఎన్ కౌంటర్‌ జరిగింది. సుమారు 12 గంటల పాటు జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా.. ఓ పోలీసు కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయాడు. శనివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమైన కాల్పులు ఆదివారం ఉదయం 6.30 గంటల వరకూ కొనసాగాయి.

ఈ కాల్పుల్లో యూరీకి చెందిన పోలీసు కానిస్టేబుల్‌ మన్జూర్‌ అహ్మద్‌ నాయక్‌ చనిపోయాడు. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని హిజ్బుల్‌ ముజాహిదీన్ కు చెందిన ఆకీబ్‌ భట్‌ అలియాస్‌ ఆకీబ్‌ మౌల్వీగా గుర్తించారు. మూడేళ్ల నుంచి ఈ ప్రాంతంలో ఇతను యాక్టివ్‌గా పనిచేస్తున్నట్టు భద్రతా బలగాలు చెపుతున్నాయి. మరో ఉగ్రవాదిని సైఫుల్లా అలియాస్‌ ఒసామాగా గుర్తించారు. పాకిస్తాన్ కు చెందిన సైఫుల్లా జేషే మహమూద్‌ ఉగ్రవాద సంస్థ తరఫున పనిచేస్తున్నట్టు తెలిపాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా