గతంలో రైలులో.. ఈసారి మాత్రం కారులో..

14 Feb, 2015 10:32 IST|Sakshi

lన్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయంతో ప్రపంచ రికార్డు సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ.  ఆ పార్టీ ముఖ్యనేత అరవింద్ కేజ్రీవాల్ ముఖమంత్రిగా, ఆరుగురు  సభ్యుల కేబినెట్ తో  ఈరోజు ప్రమాణం  స్వీకారం చేయబోతున్నారు. ఘజియాబాద్ లోని రామ్ లీలా మైదానంలో  ప్రమాణ స్వీకార కార్యక్రమాలు పూర్తయ్యాయి. గతంలో మెట్రోరైలు లో ప్రయాణిస్తూ, ప్రజలను పలకరిస్తూ  ప్రమాణస్వీకరానికి హాజరై సంచలనం సృష్టంచిన కేజ్రీవాల్ ఈ సారి మాత్రం కారులో రోడ్డుమార్గంలో  వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.

కాగా గత మూడు రోజులుగా  జ్వరంతో  బాధపడుతున్న కేజ్రీవాల్  బాగా నీరసపడ్డారని ఆప్ తెలిపింది. అయితే  ఆయన ఆరోగ్యం సహకరిస్తే  ఈ సారికూడా మార్గమధ్యంలో ప్రజలను కలుస్తారని ఆప్ వర్గాలు  తెలిపాయి. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఉదయం 10.30కి  ఇంటినుంచి బయలుదేరతారు.

మరోవైపు ప్రోటోకాల్ నిబంధనలు అనుసరించి అన్ని రక్షణ ఏర్పాట్లు చేశామని  ట్రాఫిక్ పోలీసులు  తెలిపారు.  ప్రమాణ స్వీకారం కార్యక్రమం  ముగిసిన తరువాత  రాజ్ ఘాట్ ని సందర్శించి గాంధీకి నివాళు లర్పిస్తారు.  అనంతరం సెక్రటేరియట్ కు వెడతారని అధికార వర్గాలు తెలిపాయి. 

మరిన్ని వార్తలు