మరోసారి ప్రత్యేకతను చాటుకున్న కేరళ కుట్టి

18 Aug, 2018 19:56 IST|Sakshi

తిరువనంతపురం: సోషల్‌ మీడియాలో నిష్కారణంగా అవహేళనకు గురైన కేరళ విద్యార్థిని హనన్ హమీద్‌ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కష్టాలకు, బాధలకు వెరవకుండా ప్రతికూల పరిస్థితులను నిబ్బరంగా అనుకూలంగా మార్చుకున్న హమీద్‌  రాష్ట్రంలోని  బాధితుల పట్ల తన  బాధ్యతను ప్రదర్శించారు. స్వయంగా వరద ప్రభావానికి లోనైనా కూడా ఆమె మరిన్నికష్టాలుపడుతున్న బాధితులను ఆదుకునేందుకు పెద్దమనసు చేసుకున్నారు.  కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రజలసొమ్మును తిరిగి  వరద బాధితుల కోసం రూ.1.5 లక్షలు సాయం చేసేందుకు నిర్ణయించారు.

ప్రజల నుంచి  తాను విరాళంగా పొందినదాన్ని తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు వారు  కష్టాల్లో ఉ‍న్నారు. అందుకే తాను చేయగలిగిన కనీస సాయం చేస్తున్నానన్నారు. అయితే  నేనున్న  ప్రదేశంలో మూడు వైపులా నీరు చేరటం వలన బయటికి రాలేకపోతున్నాను.  అదృష్టవశాత్తూ, నా కెలాంటి బాధలేదు.  కానీ ప్రస్తుతం మొబైల్ కనెక్టివిటీ లేదు,  బ్యాంకులు కూడా మూతపడ్డాయి. అందువల్ల  త్వరలోనే సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఈ మొత్తాన్ని బదిలీ చేస్తాను లేదా రెండు రోజుల్లో  నేరుగాముఖ్యమంత్రికి చెక్‌​ అందిజేస్తానని  హమీద్‌ స్పష్టం చేశారు.

రెండు నెలల క్రితం బీఎస్‌సీ కెమిస్ట్రీ విద్యార్థిని  హమీద్‌ కాలేజీ యూనిఫామ్‌లో చేపలు అమ్ముతూ కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైంది. ఒడిదుడుకులను అధిగమించే క్రమంలో కలల సాకారం కోసం పడిన శ్రమను కొంతమంది అవమానించారు. చేతికి తొడుగులు, వేలికి బంగారు ఉంగరం ధరించి, ఆధునిక శైలిలో తల దువ్వుకుని, బట్టలు ధరించి చేపలు అమ్మింది. దీంతో ఆమె ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో కొందరు మత ఛాందసవాదులు బెదిరింపులకు దిగడం, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌  ఆమెకుఅండగా నిలవడం తెలిసిందే.

కాగా  రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు కేరళను చిన్నాభిన్నం చేశాయి. 13 జిల్లాల్లో ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 190కి పైగా మరణాలు నమోదు కాగా, 2 లక్షల మంది వివిధ జిల్లాలలో సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు  సైన్యం, నౌకాదళం, ఎన్.డి.ఆర్.ఎఫ్, కోస్ట్ గార్డ్  దళు సహాయ,రక్షణపనుల్లో తలమునకలైవున్నాయి.  ఇంతలో మరో రెండు రోజు వర్షాలు కురవనున్నాయని  వాతవరణ శాఖ అంచనా వేసింది. 

మరిన్ని వార్తలు