నైజీరియన్ల అరెస్ట్‌..భారీగా గంజాయి స్వాధీనం

18 Aug, 2018 19:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గురుగావ్‌‌: గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు నైజీరియన్లను స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 1.3 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.5 కోట్లు ఉంటుందని అంచనా. నిందితులు యావో, ఓక్‌లీ ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం రావడంతో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం వీరు ఉంటున్న ఇంటిపై దాడి చేసి గంజాయి స్వాధీనం చేసుకుని వీరిని అదుపులోకి తీసుకుంది.

పోలీసు రిమాండ్‌కు తరలించిన తర్వాత వీరిద్దరినీ విచారించారు. దక్షిణాఫ్రికా, మెక్సికో, పెరూ దేశాల నుంచి అక్రమంగా హెరాయిన్‌ను తెప్పించి పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, ఇంకా దేశరాజధాని పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నట్లు విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. నిందితులిద్దరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు వారి పాస్‌పోర్టులు, ఇతర డాక్యుమెంట్లు కూడా సమర్పించడంలో విఫలమయ్యారని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు