-

'వంటగ్యాస్, డీజిల్, కిరోసిన్ ధరలు పెంచాలని సిఫారసు'

30 Oct, 2013 18:37 IST|Sakshi

వంట గ్యాస్, డీజిల్, కిరోసిన్ ధరలు పెంచాలని కిరీట్ పారిఖ్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రభుత్వంపై సబ్సిడీ భారం ఎక్కువగా పడుతోందని, దీంతో ధరలు పెంచకతప్పదని సూచించింది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు బుధవారం ఈ మేరకు నివేదిక సమర్పించింది.

వంటగ్యాస్పై 250 రూపాయలు, డీజల్పై ఐదు, కిరోసిన్పై నాలుగు రూపాయల చొప్పున పెంచాలని పారిఖ్ కమిటీ సూచించింది. పెట్రోలియం వనరుల సబ్సిడీ భారం 80 వేల కోట్ల నుంచి 1.30 లక్షల కోట్లకు పెరిగిందని ప్రభుత్వానికి తెలియజేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడం, డాలర్తో రుపాయి మారకం విలువ తగ్గిన నేపథ్యంలో ధరలు పెంచక తప్పదని కమిటీ పేర్కొంది.

మరిన్ని వార్తలు