మహిళల పరిస్థితి (ఆవుల)కంటే దారుణంగా..

4 Jul, 2017 23:19 IST|Sakshi


ఆవు తలను మాస్క్‌గా పెట్టుకొని సరదాగా ఫొటో దిగిందనుకుంటున్నారా? నిజమే ఈ ఫొటోలను చూస్తే ఎవరైనా ఇలాగే అనుకుంటారు. కానీ ముంబైకి చెందిన ఈ యువతి ఓ ఉన్నత లక్ష్యంతో ఇలా ఫొటోలు దిగి సోషల్‌ మీడియాలో పెట్టింది. ఇక ఈ ఫొటోల ద్వారా ఆమె చెప్పదల్చుకుందేంటంటే... దేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి. మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నా.. అడుగడుగునా దాడులు, దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటిపై ఏ రాజకీయ నాయకులుగానీ, సంఘాలుగానీ పోరాడుతున్న సంఘటనలు చాలా తక్కువ.

మరి ఈ విషయాన్ని చెప్పేందుకు ఆవు తల పెట్టుకోవడమెందుకంటరా..?
గో సంరక్షణ పేరిట ఇటీవల జరుగుతున్న సంఘటనల గురించి తెలిసిందే. ఆవులను హింసిస్తున్నవారిపై, అక్రమంగా తరలిస్తున్నవారిపై దాడులకు పాల్పడేందుకు కూడా వెనుకాడడంలేదు. మరి మహిళల అక్రమ రవాణా, వారిపై జరుగుతున్న హింసాకాండ గురించి ఎంతమంది ఇంత తీవ్రంగా స్పందిస్తున్నారు? దేశంలో మహిళల పరిస్థితి పశువుల(ఆవుల)కంటే దారుణంగా ఉందని చెప్పేందుకే ఇలా చేసింది. నిజమే కదా... వినూత్నంగా ఆలోంచించినా.. ఆలోచింపజేసేదిగా ఉంది కదూ ఈ ప్రయత్నం!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా