పఠాన్కోట్ లో మళ్ళీ పేలుడు కలకలం

5 Jan, 2016 16:05 IST|Sakshi
పఠాన్కోట్ లో మళ్ళీ పేలుడు కలకలం
పంజాబ్: పఠాన్కోట్ భారత వైమానిక స్థావరం బయట మంగళవారం మరోసారి భారీ పేలుడు శబ్దం వినిపించింది.   కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతూండగానే మళ్లీ పెద్ద ఎత్తున పేలుడు వినిపించడం కలకలం రేపింది.  దీంతో లోపల ఎంతమంది  ఉగ్రవాదులు దాగివున్నారనే  దానిపై మరింత ఆందోళన నెలకొంది.   దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
 
ఉగ్రవాదులు అసలు భారత సైనిక దుస్తుల్లో పఠాన్‌-కోట్ ఎయిర్-బేస్ వరకు ఎలా రాగలిగారు? లోపలి మ్యాప్ మొత్తం వాళ్ల వద్దకు ఎలా వచ్చింది? లోపల ఉన్నవారే ఎవరైనా ఉగ్రవాదులకు ఉప్పందించారా లాంటి అంశాలపై అనేక అనుమానాలు నెలకొన్నాయి.  ఈ నేపథ్యంలో  మళ్లీ భారీ ఎత్తున  పేలుడు శబ్దం రావడంతో లోపల ఎంతమంది ఉగ్రవాదులు దాగి వున్నరానే దానిపై తీవ్ర  ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి ఘటనలో ఇప్పటివరకూ ఆరుగురు  ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.  గత మూడు రోజులుగా  కూంబింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
 
మరిన్ని వార్తలు