పాత పింఛన్‌ పథకాన్ని పునరుద్ధరించాలి

2 Oct, 2023 05:40 IST|Sakshi

ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో ప్రభుత్వ ఉద్యోగుల ధర్నా   

న్యూఢిల్లీ: పాత పింఛన్‌ పథకాన్ని(ఓపీఎస్‌) పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ, ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఆదివారం ‘పెన్షన్‌ శంఖనాథ్‌ మహార్యాలీ’ పేరిట భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 20కిపైగా రాష్ట్రాల నుంచి వేలాది మంది ఉద్యోగులు తరలివచ్చారు. ప్రభుత్వం తీసుకొచి్చన కొత్త పింఛన్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

రిటైర్‌మెంట్‌ తర్వాత తమ జీవితానికి భరోసానిచ్చే పాత పింఛన్‌ పథకాన్ని పునరుద్ధరించాలని తేల్చిచెప్పారు. జాయింట్‌ ఫోరం ఫర్‌ రిస్టోరేషన్‌ ఆఫ్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్, నేషనల్‌ జాయింట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ యాక్షన్‌ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టినట్లు నిరసనకారులు వెల్లడించారు. 2004 జనవరి 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరినవారు కొత్త పింఛన్‌ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అలిండియా రైల్వే మెన్స్‌ ఫెడరేషన్‌ జాతీయ కనీ్వనర్‌  శివగోపాల్‌ మిశ్రా చెప్పారు.   

మరిన్ని వార్తలు