నాలుగు నెలల్లో విచారణ ముగించాలి..

14 Aug, 2018 14:04 IST|Sakshi

సాక్షి, చెన్నై: తూత్తుకుడి స్టెరిలైట్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పోలీసు కాల్పుల్లో 13 మంది మరణించిన ఉదంతంపై విచారణను మంగళవారం మద్రాస్‌ హైకోర్టు సీబీఐకి బదలాయించింది. నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. హింసను ప్రేరేపించారంటూ వామపక్ష సంస్థ మక్కల్‌ అధికారంకు చెందిన ఆరుగురు సభ్యుల అరెస్ట్‌ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది.

జాతీయ భద్రతా చట్టం కింద ఈ ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జస్టిస్‌ సీటీ సెల్వం, జస్టిస్‌ బషీర్‌ అహ్మద్‌ల నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. స్టెరిలైట్‌ ప్లాంట్‌కు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో వేదాంత గ్రూప్‌నకు చెందిన ప్లాంట్‌ను మూసివేస్తున్నట్టు మే 22న తూత్తుకుడి జిల్లా యంత్రాంగం పేర్కొంది.

మరిన్ని వార్తలు