మాల్‌లో భారీ అగ్నిప్రమాదం

3 Oct, 2019 18:26 IST|Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌ ప్రాంతంలో ఓ బహుళ అంతస్తుల మాల్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బేస్‌మెంట్‌ నుంచి పెద్ద ఎత్తున పొగలు వ్యాపించడంతో 15 అగ్నిమాపక యంత్రాలను రప్పించి మంటలు ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదం జరిగిన వైశాఖి మాల్‌లో పొగ దట్టంగా అలుముకోవడంతో ఫైర్‌, ఎమర్జెన్సీ సేవలు భవనంలోకి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. బేస్‌మెంట్‌లోని ఇళ్లు, పార్కింగ్‌ ప్రదేశంతో పాటు పలు కార్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఫైర్‌, ఎమర్జెన్సీ సేవల మంత్రి సుజిత్‌ బసు, కోల్‌కతా నగర మేయర్‌ కృష్ణ చక్రవర్తి ఘటనా ప్రాంతంలో ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది, అధికారులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

మరిన్ని వార్తలు