‘ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం’

21 Nov, 2018 21:01 IST|Sakshi

గవర్నర్‌కు లేఖ రాసిన మెహబూబా ముఫ్తీ

శ్రీనగర్‌ : గవర్నర్‌ పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీల మద్దతుతో జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం తాను శ్రీనగర్‌లో ఉన్నందున గవర్నర్‌ను ప్రత్యక్షంగా కలవలేకపోతున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నచోట ఫ్యాక్స్‌ పనిచేయనందున ఈ మెయిల్‌ ద్వారా లేఖను పంపిస్తానని తెలిపారు.

కాగా పీడీపీతో బీజేపీ పొత్తు తెంచుకున్న అనంతరం కశ్మీర్‌లో గవర్నర్‌ పాలన విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కాంగ్రెస్‌, ఎన్సీ పార్టీలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముఫ్తీ ముందుకొచ్చారు. అయితే ఈ విషయంపై గవర్నర్‌ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు