గాంధీకి మోదీ పుష్పాంజలి

1 Oct, 2014 02:05 IST|Sakshi
గాంధీకి మోదీ పుష్పాంజలి

వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఉన్న భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పుష్పాంజలి ఘటించారు. అమెరికా పర్యటన చివరిరోజున మోదీ.. ఇక్కడి డ్యూపాంట్ సర్కిల్‌లో మాజీ ప్రధాని వాజ్‌పేయి 2000వ సంవత్సరంలో ఆవిష్కరించిన ఆ గాంధీ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. భారత ఎంబసీకి ఎదురుగా ఉన్న ఆ ప్రాంతంలో మోదీ 15 నిమిషాల పాటు గడిపారు.

మోదీ రాక సందర్భంగా అక్కడకు చేరిన వందలాది మంది భారత అమెరికన్లు ‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలతో విగ్రహం ఉన్న లెక్సింటన్ ఎవెన్యూ ప్రాంతాన్ని హోరెత్తించారు. వారితో మోదీ ముచ్చటించారు. మోదీతో కలసి వచ్చిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా గాంధీకి నివాళులర్పించారు. ఎంబసీ లోపలికి వెళ్లే ముందు మోదీ ఫొటోలు దిగారు. 8.8 అడుగుల ఎత్తుండే ఆ గాంధీ కాంస్య విగ్రహాన్ని ప్రముఖ శిల్పి గౌతమ్ పాల్ రూపొందించారు.
 
 

మరిన్ని వార్తలు