ఆశువుగా మోడీ పంద్రాగస్టు ప్రసంగం!

15 Aug, 2014 04:18 IST|Sakshi
ఆశువుగా మోడీ పంద్రాగస్టు ప్రసంగం!

ఆర్థిక సేవల మిషన్ ప్రకటన
15 కోట్ల కుటుంబాలకు బ్యాంకు ఖాతాలే లక్ష్యం

 
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన తొలి పంద్రాగస్టు ప్రసంగంలోనూ ప్రత్యేకత చాటుకోనున్నారు. ఎర్రకోట పైనుంచి దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని ప్రసంగ పాఠంలోంచి చదవడం ప్రధానులకు ఆనవాయితీగా వస్తుండగా అందుకు భిన్నంగా మోడీ ఆశువుగా ప్రసంగించనున్నారు. తన ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు, అనుసరించనున్న విధానాలను మోడీ ఈ ప్రసంగంలో వెల్లడించనున్నారు. విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలపైనా మాట్లాడనున్నారు.

ముఖ్యంగా పేదల అభ్యున్నతి కోసం ఓ సరికొత్త పథకాన్ని ప్రకటించబోతున్నారు. ఆర్థిక సేవల మిషన్ పేరుతో దేశంలోని 15 కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతాలను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించనున్నారు. ఈ ఖాతాలు పొందిన వారికి 5 వేల రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, లక్ష రూపాయల ప్రమాద బీమా కూడా కల్పిస్తారు. ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన ఈ పథకాన్ని ఈ నెలాఖరు కల్లా మోడీ ప్రారంభించనున్నారు. ఈ నెల 28 లేదా 29న ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 2018 ఆగస్టులోగా మొత్తం 15 కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతాలు తెరవనున్నారు.
 

మరిన్ని వార్తలు