మెలోనీ ‘మెలోడీ’కి మోదీ ఫిదా

3 Dec, 2023 05:17 IST|Sakshi
మోదీతో మెలోనీ సెల్ఫీ

మోదీతో సెల్ఫీని ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన ఇటలీ ప్రధాని

ఇంటర్నెట్లో వైరలైన పోస్టు, చూస్తుండగానే 2.2 కోట్ల వ్యూస్‌

న్యూఢిల్లీ: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చేసిన ‘మెలోడీ’కి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు నెటిజన్లంతా ఫిదా అయ్యారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానులిద్దరి మధ్య నడిచిన పోస్టులు వైరల్‌గా మారాయి. శుక్రవారం దుబాయ్‌లో కాప్‌28 సదస్సు సందర్భంగా వారిద్దరూ భేటీ కావడం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీతో తీసుకున్న సెల్ఫీని మెలోనీ శనివారం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.‘కాప్‌28 సదస్సులో మంచి మిత్రులు’అనే క్యాప్షన్‌తో పాటు, తామిద్దరి పేర్లనూ అందంగా కలుపుతూ ‘మెలోడీ’అంటూ హాష్‌టాగ్‌ జత చేశారు. దాంతో ఆ పోస్ట్‌ వైరల్‌గా మారింది. చూస్తుండగానే దానికి ఏకంగా 2.2 కోట్ల వ్యూస్‌ వచ్చాయి. దీనికి మోదీ కూడా సరదాగా స్పందించారు. ‘మిత్రులతో కలయిక ఎప్పుడూ ఆహ్లాదకరమే’అనే క్యాప్షన్‌తో మెలోనీ సెల్ఫీని రీపోస్ట్‌ చేశారు. వారి పోస్టులు ఇప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

జీ20 నుంచీ ట్రెండింగ్‌లోనే..
నిజానికి ‘మెలోడీ’ హా‹Ùటాగ్‌ గత నెలలో భారత్‌ తొలిసారి ఆతిథ్యమిచి్చన జీ20 శిఖరాగ్ర సదస్సు జరిగినప్పటి నుంచీ ఇంటర్నెట్లో వైరలైంది. సోషల్‌ సైట్లలో తెగ తిరుగుతోంది. ఆ సదస్సు ఆద్యంతం మోదీ, మెలోనీ పరస్పరం స్నేహపూర్వకంగా మెలిగిన తీరు అందరి దృష్టినీ బాగా ఆకర్షించింది. ఆతిథ్య దేశ సారథిగా మిగతా దేశాధినేతలతో పాటు మెలోనీని కూడా మోదీ సాదరంగా సదస్సుకు ఆహ్వానించారు. ఆ సందర్భంగా ఆమె మోదీతో కరచాలనం చేశారు. కాసేపు ముచ్చటించుకుని ఇరువురూ నవ్వుల్లో మునిగి తేలారు. ఇదే ఒరవడి తాజాగా కాప్‌28 సదస్సులోనూ కొనసాగింది.  

మరిన్ని వార్తలు