తుపాకీ లైసెన్సుదారుల డేటాబేస్‌

17 Jul, 2018 02:39 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో తుపాకీ లైసెన్స్‌లు కలిగిన వారందరికీ ఓ విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించి వారి పేర్లతో జాతీయ స్థాయిలో డేటాబేస్‌ను రూపొందించనున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. వచ్చే ఏప్రిల్‌ కల్లా ఈ డేటాబేస్‌ అందుబాటులోకి వస్తుందంది. ఏప్రిల్‌ నుంచి అధికారులు కొత్తగా లైసెన్సులు జారీచేసేటప్పుడు లేదా పాత లైసెన్సును పునరుద్ధరించేటప్పుడు ఆయుధం యజమాని వివరాలను ఈ డేటాబేస్‌లో నమోదు చేయాల్సిందేనని వెల్లడించింది.

మరిన్ని వార్తలు