నిర్భయ కేసులో అమికస్ క్యూరీలపై స్పష్టత

12 Jul, 2016 11:48 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘నిర్భయ’ అత్యాచారం, హత్య కేసులో ఇద్దరు అమికస్ క్యూరీల నియామకంపై సుప్రీం కోర్టు స్పష్టతనిచ్చింది. వీరి నియామకం దోషుల తరఫు లాయర్ల హోదా, సామర్థ్యాన్ని కించపరచదని తెలిపింది. అమికస్ క్యూరీల నియామకంతో లాయర్ల సామర్థ్యంపై ప్రజల్లో కొన్ని తప్పుడు అభిప్రాయాలు నెలకొని ఉన్నాయని దోషుల తరఫు న్యాయవాది ఒకరు చెప్పాక జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ పై విధంగా స్పందించింది.

కేసులో రెండు వర్గాలు తమ న్యాయవాదులను నియమించుకున్నా కోర్టులు అమికస్ క్యూరీలను నియమిస్తాయి. దీనర్థం న్యాయవాదులు అసమర్థులని కాదు. అమికస్ క్యూరీల అభిప్రాయంతో కేసు గురించి మరింత తెలసుకుంటాం ’ అని పేర్కొంది.

మరిన్ని వార్తలు