క్రీడలకు నామమాత్రపు పెంపు..

1 Mar, 2016 03:50 IST|Sakshi
క్రీడలకు నామమాత్రపు పెంపు..

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో క్రీడలకు నిధులు నామమాత్రంగా పెంచారు. గత బడ్జెట్‌తో పోలిస్తే కేవలం రూ. 50.87 కోట్లు ఎక్కువ ఇచ్చారు. 2016-17 బడ్జెట్‌లో క్రీడలకు ప్రణాళిక వ్యయం కింద రూ. 1,400 కోట్లు, ప్రణాళికేతర వ్యయం కింద రూ. 192 కోట్లు మొత్తం రూ. 1592 కోట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేటాయించారు. గత బడ్జెట్‌లో క్రీడలకు రూ. 1541.13 కోట్లు ఇచ్చారు. స్పోర్ట్స్ అథారిటీకి రూ. 381.30 కోట్లు, క్రీడా సంస్థలకు రూ. 545.90 కోట్లు కేటాయించారు.

మరిన్ని వార్తలు