ప్రతి 3 నిమిషాలకు ఒకరు బలి

3 Jun, 2014 16:22 IST|Sakshi
ప్రతి 3 నిమిషాలకు ఒకరు బలి

న్యూఢిల్లీ: ఉగ్రవాదం, వ్యాధుల కంటే రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతోంది. మన దేశంలో ప్రతి మూడు నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారు. గత దశాబ్దం కాలంలో 12 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. జాతీయ క్రైం రికార్డ్స్ బ్యూరో ఈ విషయాలను వెల్లడించింది.  గత పదేళ్లలో జనాభా పెరుగుదల శాతం కంటే రోడ్డు ప్రమాద మరణాల శాతం ఎక్కువగా ఉండటం విస్తుగొలిపే అంశం. క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం మరిన్ని వివరాలు..

  • ప్రతి రోజూ ప్రత్యేకించి రోడ్డు ప్రమాదాల్లో 381 మంది మరణిస్తున్నారు. మరో 1287 మంది గాయాలపాలవుతున్నారు.
  • ప్రతి రోజూ రైల్వే ప్రమాదాల్లో 80 మంది చనిపోతున్నారు. మరో 14 మంది గాయపడుతున్నారు.
  • ట్రక్ ప్రమాదాల్లో రోజూ 73 మంది మరణిస్తున్నారు.
  • ద్విచక్ర వాహన ప్రమాదాల్లో రోజూ 89 మంది మృత్యువాత పడుతున్నారు.
  • 2003-2012 మధ్య కాలంలో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య 51.8 శాతం పెరిగింది.
  • 2003-2012 మధ్య జనభా పెరుగుదల 13.6 ఉంటే రోడ్డు ప్రమాదాల మరణాలు 34.2 శాతం పెరిగాయి.
  • ప్రమాదాల్లో రోడ్డు ప్రమాదాలే ఎక్కువగా ఉంటున్నాయి.
  • 2012లో దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా 1, 68, 301 మంది మరణించారు.
     

మరిన్ని వార్తలు