‘ట్రస్టు చట్ట సవరణ’కు లోక్‌సభ ఆమోదం

10 Dec, 2015 02:48 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నిరసనల మధ్యే లోక్‌సభ బుధవారం ‘భారతీయ ట్రస్టుల చట్టం (1882) సవరణ 2015’కు ఆమోదముద్ర వేసింది. ఈ చట్టం వల్ల ట్రస్టులకు స్వయం ప్రతిపత్తి ఇవ్వటంతోపాటు.. వీటి నిధులను సెక్యూరిటీస్‌లో పెట్టుబడిపెట్టేందుకు వీలుంటుంది. 2014 డిసెంబర్‌లో ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

► వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు అమలుకు విపక్ష కాంగ్రెస్ సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో జీఎస్‌టీ అమలు దేశానికి చాలా కీలకమన్నారు.
► త్వరలో రష్యాలో పర్యటించనున్న ప్రధాని అణుబంధ విస్తృతిపైనే ప్రధానంగా చర్చిస్తారని పీఎంవో సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
► మొబైల్ వినియోగదారులకు ఎస్టీడీ చార్జీల తొలగింపుపై ఎలాంటి ప్రతిపాదన లేదని టెలికాం మంత్రి రవిశంకర్ లోక్‌సభకు తెలిపారు.
► సిబ్బంది శిక్షణ విభాగం(డీవోపీటీ) అనుమతి తీసుకున్నాకే గ్రూప్-బీ నాన్‌గెజిటెడ్, గ్రూప్-సీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించుకోవాలని వివిధ ప్రభుత్వ విభాగాలకు కేంద్రం స్పష్టం చేసింది.
► వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా మహారాణా ప్రతాప్ 475వ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ తెలిపారు.
► ‘జాతీయ నేత’గా ఎవరిని ప్రకటించాలనే విషయంలో నిబంధనలేమీలేవని కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నకు ప్రభుత్వం జవాబిచ్చింది.

మరిన్ని వార్తలు