5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలంటే..

30 Sep, 2019 15:22 IST|Sakshi

చెన్నై : 2024 నాటికి భారత్‌ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్ధగా ఎదగడంలో ఐఐటియన్ల వినూత్న సాంకేతికత కీలక పాత్ర పోషించాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఐఐటీ మద్రాస్‌ 56వ స్నాతకోత్సవంలో ప్రధాని ప్రసంగిస్తూ భారత్‌ అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ఉవ్విళ్లూరుతోందని, ఈ స్వప్నం సాకారమయ్యేందుకు మీ వినూత్న సాంకేతికత, ఆకాంక్షలు, ఉత్సాహం బాటలు వేస్తుందని వ్యాఖ్యానించారు. ఐఐటియన్లలో తాను నవ భారత స్ఫూర్తిని చూస్తున్నానని చెప్పుకొచ్చారు. మీ ముందున్న తాను నవ భారతాన్ని, మినీ భారతాన్ని చూడగలుగుతున్నాని..మీలో శక్తి, ఉత్సాహం, సానుకూల దృక్పథం మన స్వపాల్నను నెరవేర్చుకునేందుకు దోహదపడతాయని అన్నారు. మీ కళ్లలో భవిష్యత్‌ స్వప్నాలను తాను వీక్షిస్తున్నానని, దేశ భవిష్యత్‌ గమ్యం మీ కళ్లలో దాగుందని వ్యాఖ్యానించారు. దేశంలో అత్యంత పురాతన భాషల్లో ఒకటైన తమిళ భాష తమిళనాడులో వేళ్లూనుకుందని అన్నారు. ఐఐటీ మద్రాస్‌ అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్ధని ఆయన అభివర్ణించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు