హాస్యం అంటే భయమన్న మోదీ ఏం చేశారు?

28 Jun, 2016 13:50 IST|Sakshi
హాస్యం అంటే భయమన్న మోదీ ఏం చేశారు?

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  సోషల్ మీడియలో యాక్టివ్ గా ఉండడం అందరికీ తెలిసిందే. అలాగే జాతీయ ఎన్నికల  ఓటింగ్ సందర్భంగా.. బీజేపీ పార్టీ గుర్తుతో   దిగిన సెల్ఫీ దగ్గరనుంచి మొదలు పెడితో ఆయన సెల్ఫీల హడావిడి.. సరదా కూడా మామూలుది కాదు. ఇదంతా ఒక ఎత్తయితే.. ఇపుడు  ఒక జాతీయ పత్రికలో  ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన  చేసిన ట్విట్  ఒకటి టాక్ ఆఫ్ ది నేషన్ గా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. అవును .. ఆర్నబ్ గోస్వామి తో టెలివిజన్ సంభాషణ గురించి  చెబుతూ ..   ఆర్నబ్ గోసామితో నిర్మిహమాటంగా తాను ఏం షేర్  చేశానో...జాతి తెలుసుకోవాలనుకుంటోందా... అయితే  చూడండి. అంటూ   ట్విట్ చేసి తన   హాస్య చతురతను చాటుకున్నారు.  కొంచెం వినోదాత్మకంగా..మరికొంచెం కొంటెగా  ట్వీట్ చేసిన ప్రధాని ..తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు.

'ద  నేషన్ నీడ్స్  టు  నౌ '  అనగానే దాదాపు  అందరికీ గుర్తు వచ్చే పేరు  టైమ్స్ నౌ ఎడిటర్-ఇన్-చీఫ్  ఆర్నబ్  గోస్వామి.  ఈ నేపథ్యంలో ఆర్నబ్  ను ఇమిడిటేట్ చేస్తూ  మోదీ తన  రాబోయే టెలివిజన్ ఇంటర్వ్యూ  గురించి తన అనుచరులను అప్రమత్తం చేసేందుకు  ట్విట్టర్ ను  సోమవారం ఇలా వాడుకున్నారన్నటమాట.  అలాగే ఇపుడు హాస్యాన్ని  వెనక్కి తెచ్చుకోవాలనే  విషయాన్ని జాతి తెలుసుకుంటే మంచిదనే సందేశాన్ని  కూడా  మోదీ అందించారు.

సోమవారం నాటి ఇంటర్వ్యూలో  తన ప్రభుత్వ  పథకాలు, విజయాలు ఆర్థిక వృద్ది గురించి మాట్లాడిన  ప్రధాని.....ప్రస్తుత రోజుల్లో హాస్యం ప్రమాదకరంగామారిందని వ్యాఖ్యానించారు. 24/7 వార్తా ఛానెల్స్  రాజ్యం ఏలుతున్న ప్ర్తస్తుత తరుణంలో ఏం మాట్లాడినా ప్రమాదంగానే ఉందనీ... ఎవరో ఒకరు ఏదో ఒక తప్పును పట్టుకోవడం, వివాదం సృష్టించడం పరిపాటిగా మారింపోయిందన్నారు. ఈ సందర్భంగా తన్మయ్ భట్ ఉందంతాన్ని ప్రస్తావించారు. అందుకే సాధారణంగా సరదాగా  ఉండే తాను కూడా   చాలా సీరియస్ గామారిపోయానని తెలిపారు. తన పార్లమెంట్  ప్రసంగాల్లో కూడా ఇదే ధోరణి ఉంటుందన్నారు.  ఒక విధంగా హాస్యం అంటే తనకు భయంగా పట్టుకుందన్నారు. ఈ భయం ప్రజా జీవితంలో కూడా ఉందనీ,  హాస్యం  ముగిసిపోయిందని ఇది ఆందోళన కలిగించే విషయమని మోదీ పేర్కొన్నారు.   

 


 

>
మరిన్ని వార్తలు