'గిరిరాజ్ తప్పించుకు తిరిగితే, ఆస్తులను జప్తు చేస్తాం'

24 Apr, 2014 10:53 IST|Sakshi
'గిరిరాజ్ తప్పించుకు తిరిగితే, ఆస్తులను జప్తు చేస్తాం'
పాట్నా: కోర్టు ఆదేశాలతో బీహార్, జార్ఖండ్  పోలీసులు బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ ను అరెస్ట్ చేసేందుకు నివాసంపై సోదాలు నిర్వహించారు. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో గిరిరాజ్ పై బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో బొకారో, పాట్నా పోలీసులు దాడులు నిర్వహించారు. 
 
అయితే దాడుల నిర్వహించిన సమయంలో గిరిరాజ్ ఆచూకీ లభ్యం కాలేదని పాట్నా సిటి సూపరింటెండెంట్ పోలీస్ జయకాంత్ తెలిపారు. జార్ఖండ్ పోలీసులు నగరంలో ఉన్నారని.. పాట్నా పోలీసుల బృందం సహకారంతో గిరిరాజ్ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జయకాంత్ తెలిపారు. 
 
గిరిరాజు లొంగుబాటుకు ముందే అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ ఆయన తప్పించుకు తిరిగితే.. కోర్టు సహాయంతో గిరిరాజ్ ఆస్తులను జప్తు చేసేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు తెలిపారు. 
మరిన్ని వార్తలు