భూటాన్ బయలుదేరిన ప్రణబ్

7 Nov, 2014 09:53 IST|Sakshi
భూటాన్ బయలుదేరిన ప్రణబ్

న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం భూటాన్ బయలుదేరి వెళ్లారు. పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రణబ్కు వీడ్కోలు పలికారు. రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా, బీజేపీ సీనియర్ నాయకుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీతోపాటు నలుగురు ఎంపీలు ప్రణబ్ వెంట భూటాన్ పయనమైనవారిలో ఉన్నారు.

భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యెల్ వాంగ్‌చుక్ ఆహ్వానంపై ప్రణబ్ ఆ దేశం వెళ్లారు. దాదాపు 26 ఏళ్లలో తొలిసారిగా ప్రణబ్ భూటన్లో పర్యటిస్తున్నారు. భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ మొట్టమొదటిగా భూటన్లో పర్యటించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు