శాంతి దూతగా పంపండి : మొఘలాయి వారసుడు

17 Aug, 2019 14:55 IST|Sakshi

హైదరాబాద్‌: మొఘల్ సామ్రాజ్యానికి చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడిగా ప్రకటించుకున్న ప్రిన్స్‌ యాకుబ్ హబీబుద్దీన్ టుసీ శనివారం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా తనను జమ్మూకశ్మీర్‌కు ‘శాంతి దూత’గా  నియమించాలని రాష్ట్రపతిని ఓ లేఖ సమర్పించారు. ‘జమ్ము కశ్మీర్‌ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య శాంతిని నెలకొల్పడానికి పనిచేస్తాను. మొఘలాయి వంశ వారసత్వానికి ఉన్న ప్రజాదారణతో ప్రత్యక్షంగా అక్కడి ప్రజలతో మమేకవుతాను. దేశద్రోహ సమూహాలతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో నేను కశ్మీర్‌ను సందర్శించాలి. ఒక భారతీయుడిగా, మొగల్‌ వంశ వారసుడిగా నాపై ఆ బాధ్యతలు ఉన్నాయి. 

జమ్మూ, లఢఖ్‌లో నివసిస్తున్న మా వంశస్తులకు శాంతి, సౌఖ్యాలను పెంచడానికి నన్ను శాంతి దూతగా పంపాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను మొఘలాయి రాజులు శక్తిమంతమైందిగా నిలిపారు. నన్ను కశ్మీర్‌కు శాంతి దూతగా పంపిస్తే గౌరవ సూచకంగా ఉంటుంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు కశ్మీర్‌లో స్వార్థమయమడంతో వల్లే ప్రజలు తప్పుదారి పట్టారు. కానీ, ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో కశ్మీర్‌లో శాంతి స్థాపనకు కీలక పాత్ర పోషిస్తాను’అని లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ మొఘలాయి వారసుడి లేఖపట్ల రాష్ట్రపతి ఎలా స్పందిస్తారో చూడాలి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా