-

వాటిని ప్రచారం చేయకండి: సీఆర్పీఎఫ్‌

17 Feb, 2019 18:35 IST|Sakshi

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి సోషల్‌ మీడియాలో పలు పోస్టులు విపరీతంగా వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో నిజనిజాలు తెలుసుకోకుండా చాలా మంది నెటిజన్లు వాటిని తెగ షేర్‌లు చేస్తున్నారు. దీంతో అమరులైన జవాన్ల స్థానంలో నకిలీ ఫొటోల షేర్‌ అవుతున్నాయి. ఈ రకమైన తప్పుడు వార్తలపై సీఆర్పీఎఫ్ స్పందించింది. అంతేకాకుండా సోషల్‌ మీడియా యూజర్లకు ఓ సూచన కూడా చేసింది. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల మృతదేహాలకు బదులు కొందరు దుండగులు నకిలీ ఫొటోలను ప్రచారం చేస్తున్నారు.. దయచేసి అలాంటి షేర్‌లు, లైక్‌లు చేయవద్దని విజ్ఞప్తి చేసింది. అటువంటి ఏమైనా ఉంటే webpro@crpf.gov.inకు సమాచారం అందించాలని కోరింది.

అంతేకాకుండా కశ్మీర్‌లోని విద్యార్థులపై జవాన్లు వేధింపులకు పాల్పడుతున్నారని కొందరు దుండగులు ప్రచారం చేస్తున్న వార్తలను కూడా సీఆర్పీఎఫ్‌ ఖండించింది. దీని గురించి సీఆర్పీఎఫ్‌ అధికారులు విచారణ చేపట్టారని.. అందులో ఏ మాత్రం నిజం లేదని తేలిందని పేర్కొంది.

మరిన్ని వార్తలు