-

లగ్జరీ ఇళ్ల గిరాకీ : కోట్లు అయినా...సరే! హైదరాబాదీల జోరు

27 Nov, 2023 16:47 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ అనంతరం పరిస్థితుల్లో భారతీయ రియల్ ఎస్టేట్ దూసుకుతోంది. ముఖ్యంగా లగ్జరీ ఇళ్లకు డిమాండ్‌ భారీగా పుంజుకుంది. స్మార్ట్‌, లగ్జరీ హోమ్స్‌, టాప్‌ క్లాస్‌ ఎమినిటీస్ ఉంటే చాలు ధర ఎంతైనా వెనుకాడ్డం లేదు.  4 కోట్ల రూపాయ విలువైన  ఇళ్లను  సొంతం  చేసుకునేందుకు బడాబాబులు ఎగబడుతున్నారు. స్మార్ట్ హోమ్ టెక్నాలజీకి అభిస్తున్న ఆదరణ, పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, ఆదాయాలు, మెరుగైన జీవన ప్రమాణాపై పెరుగుతున్న ఆకాంక్ష,ప్రధాన మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో విలాసవంతమైన నివాసాల కొరత వంటి అనేక అంశాలు లగ్జరీ హౌసింగ్ అమ్మకాల పెరుగుదలకు దారితీసినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.

2023 జనవరి-సెప్టెంబర్ మధ్య భారతదేశంలో రూ. 4 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన విలాస వంతమైన గృహాల విక్రయాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2023  తొలి  తొమ్మిది నెలల్లో 97 శాతం పెరిగాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ CBRE  నివేదిక వెల్లడించింది. భారతదేశంలోని ఏడు నగరాల్లో, ఈ సంవత్సరం 9,200 లగ్జరీ గృహాలు అమ్ముడైనాయి. గత సంవత్సరం ఈ సంఖ్య 4,700 యూనిట్లు  మాత్రమే.  ఈ కాలంలో జరిగిన  మొత్తం లగ్జరీ హౌసింగ్ విక్రయాల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, హైదరాబాద్‌ల వాటా 90 శాతంగా ఉందని వేదిక ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 37 శాతం, ముంబైలో 35 శాతం, హైదరాబాద్‌లో 18 శాతం అమ్మకాలు జరిగాయి. మిగిలిన 4 శాతం పూణేలో నమోదైనాయి.  (విడాకుల వివాదం : తొలిసారి స్పందించిన గౌతమ్‌ సింఘానియా)

అంతేకాదు అక్టోబరు- డిసెంబరు పండుగల సీజన్‌లో లగ్జరీ హౌసింగ్ విక్రయాలు మరింత జోరందు కుంటాయని  కూడా  నివేదించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో తొలిసారిగా లగ్జరీ గృహాలను కొనుగోళ్లు  భారీగా పెరుగుతాయని భావిస్తున్నట్లు సంస్థ తెలిపింది. లగ్జరీ లైఫ్‌పై  పెరుగుతున్న  ఆసక్తి, ఈ పెరుగుదలకు కొన్నికారణాలులుగా సీబీఆర్‌ఈ వెల్లడించింది. ఈప్రాధాన్యతల కారణంగా ప్రీమియం, లగ్జరీ హౌసింగ్ విభాగంలో రెసిడెన్షియల్ అమ్మకాలతోపాటు, కొత్త లాంచ్‌లు పెరుగుతాయని అంచనా వేసింది. 2023లో 10 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని  సీబీఆర్‌ఈ  నివేదిక పేర్కొంది. అలాగే సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడి అవకాశాలను కోరుకునే అధిక-నికర-విలువ గల వ్యక్తులు (HNIలు), ప్రవాస భారతీయులు (NRIలు) ఆసక్తి  కూడా ఈ పెరుగుదలకు దోహదపడుతోందని వెల్లడించింది.  (ఇండిగో నిర్వాకం: ఇక సీటు కుషన్‌కీ డబ్బులు అడుగుతారేమో?)

మరిన్ని వార్తలు